GST official missing: ఉత్తర్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ, వ్యాపార వర్గాల్లోని ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ అధికారులు. కోట్ల రూపాయలు పట్టుకున్న ఉదంతాలు వెలుగు చూస్తున్న తరుణంలో.. మహారాష్ట్ర, ముంబయిలో వస్తు సేవల పన్ను-జీఎస్టీ జాయింట్ కమిషనర్ కనిపించకుండా పోవటం కలకలం రేపింది. జీఎస్టీ అధికారి అదృశ్యం సంచలనంగా మారింది. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
ముంబయిలోని మజ్గావ్ ప్రాంతంలో ఉన్న జీఎస్టీ కార్యాలయం నుంచి మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లారు జాయింట్ కమిషనర్(55). సాయంత్రం అవుతున్నా తిరిగిరాలేదు. దీంతో ఆయన సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేశారు పోలీసులు.