తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొన్నటి వరకు ఆ దేశంలో హోటల్ యజమాని.. ఇప్పుడు భారత్​లో అప్పడాల వ్యాపారి

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అవస్థలు పడ్డ ఓ భారతీయుడు.. చివరకు స్వదేశానికి చేరుకున్నాడు. 14 ఏళ్ల పాటు కొలంబోలో హోటల్​ నిర్వహించిన అబ్దుల్ షఫీ.. కేరళలోని తన స్వస్థలానికి చేరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శ్రీలంకలో అతడు ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకున్నాడు.

kerala man returns from srilanka
kerala man returns from srilanka

By

Published : Jul 17, 2022, 3:44 PM IST

Updated : Jul 17, 2022, 6:25 PM IST

శ్రీలంక నుంచి వచ్చి అప్పడాల వ్యాపారం.. భారతీయుడి కొత్త జీవితం

"శ్రీలంకలో గ్యాస్​ లేదు. ఒక లీటర్​ పెట్రోల్​ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. అదంతా నరకంలా ఉంది" అంటూ శ్రీలంకలో తన అనుభవాన్ని చెప్పాడు అబ్దుల్లా మహ్మద్​ షఫీ. 14 ఏళ్ల పాటు శ్రీలంకలో నివసించిన షఫీ..నార్త్ సెంట్రల్​ కొలంబోలో హోటల్​ను నిర్వహించాడు. కానీ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి. గత మూడు నెలలుగా అక్కడ నరకయాతన అనుభవించిన షఫీ.. తన స్వస్థలమైన కేరళలోని కాసర్​గోడ్​కు చేరుకున్నాడు. ప్రస్తుతం షఫీ తన జీవనం కోసం అప్పడాలు అమ్ముకుంటున్నాడు.

అప్పడాలు ప్యాక్ చేస్తూ
అప్పడాలు ప్యాక్ చేస్తున్న మహ్మద్ అబ్దుల్​ షఫీ

"హోటల్​ను నిర్వహించేందుకు అవసరమైన గ్యాస్​ దొరకడం కష్టంగా మారింది. హోటల్​కు వచ్చే వారి సంఖ్య సైతం క్రమంగా తగ్గిపోయింది. ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. మరో అవకాశం లేకపోవడం వల్ల హోటల్​ను మూసివేశాను. మరో మిత్రుడితో కలిసి మెడికల్​ షాపును ప్రారంభించాను. అది కూడా సరిగ్గా నడవలేదు."
-మహ్మద్ అబ్దుల్​ షఫీ

అన్నీ వదిలేసి శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన షఫీ.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. తన మిత్రుడి సలహాతో అప్పడాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. శ్రీలంకలోని తన స్నేహితులు పిలుస్తున్నారని షఫీ చెబుతున్నాడు. అక్కడ ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని.. రోజు ఆహారం దొరకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా కేరళకు చెందిన అనేక మంది శ్రీలంకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.

మహ్మద్ అబ్దుల్​ షఫీ
Last Updated : Jul 17, 2022, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details