viveka murder case :దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ జూన్ మూడో వారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు ఇచ్చింది.
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని...ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 25కి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరిన సీబీఐ.. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలకం అని తెలిపింది. హత్యకు కుట్ర చేయడంతో పాటు హతమార్చడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించి సిట్ ఛార్జిషీట్ వేయనందునే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందని వాదించిన సీబీఐ తరఫు న్యాయవాదులు.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. హత్య వెనక దాగి ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ నెల 25న వాదనలు..ఇక.. గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపిస్తూ.. అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించిందని అన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయడం తగదని అన్నారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనను సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్స మర్థించారు. తెలంగాణ హైకోర్టులో ఈనెల 25న వాదనలు కొనసాగనున్నాయి.