కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో తొమ్మిదోతరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పాఠశాలలు ప్రారంభమైన క్రమంలో తొలిరోజు తరగతులకు హాజరైన బాలిక ఇంటికి వచ్చి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బాలిక బలవన్మరణం.. మొటిమలే కారణమా? - suicide due to increased acne in face!
యుక్త వయసు రాగానే ముఖంపై మొటిమలు ఏర్పడటం సహజం. కానీ, తన ముఖంపై పెరుగుతోన్న మొటిమలను ఎవరికీ చూపించుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
బాలిక బలవన్మరణం.. మొటిమలే కారణమా..!
జిల్లాలోని పల్తాడి గ్రామానికి చెందిన దివ్య మృతికి ముఖంపై మొటిమలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ముఖంపై పెరుగుతున్న మొటిమలతో ఇబ్బందులు పడుతోందని.. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని, ఎవరి ఇంటికీ వెళ్లట్లేదని ఆమె బంధువులు తెలిపారు. తాను అందవిహీనంగా మారుతున్నాననే భావనతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కేంద్ర మాజీ హోం మంత్రి భూటా సింగ్ కన్నుమూత