తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 'ట్రయాంగిల్ లవ్' హత్య.. ప్రేయసి కోసం స్నేహితుడిని దారుణంగా పొడిచి.. - 72 Years Old Man Raped 12 Year Girl In Udaipur

ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడిని హత్య చేసిన మరో ఘటన గుజరాత్​లో జరిగింది. పదునైన ఆయుధంతో శరీరంపై పలు మార్లు పొడిచి స్నేహితుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. మరోవైపు మనవారాలి వయస్సున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన రజస్థాన్​లో జరిగింది.

Gujarat Love Triangle Latest News
గుజరాత్​ లవ్​ ట్రయాంగిల్​ తాజా వార్తలు

By

Published : Feb 26, 2023, 10:00 PM IST

Updated : Feb 26, 2023, 10:37 PM IST

ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడిని హత్య చేసిన హైదరాబాద్​ ఘటన మరువక ముందే మరో 'లవ్ ట్రయాంగిల్' హత్య వెలుగులోకి వచ్చింది. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. ఓ అమ్మాయితో ప్రేమ విషయంలో తలెత్తిన గొడవే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అహ్మదాబాద్​లోని కుబేర్​నగర్​లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. లక్ష్మన్ అలియాస్ లఖు ఠాకూర్ అనే వ్యక్తి తన స్నేహితుడు సుమిత్ అడ్వాణీతో కలిసి కుబేర్​నగర్​లోని జీ వార్డులో ఉన్న షాన్ హోటల్ వెనక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారిగా సుమిత్​పై లక్ష్మన్ దాడి చేశాడు. పదునైన ఆయుధంతో అతడిని చంపేశాడు. వీరిద్దరూ గతంలో స్నేహితులే. అయితే, ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన గొడవ వల్ల స్నేహం దెబ్బతింది. వీరి ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. పదేపదే శరీరాన్ని పొడిచినట్లు భావిస్తున్నారు.

మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సదర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. హత్య ఎలా చేశాడనేది విచారణలో అడిగి తెలుసుకుంటామని చెప్పారు.

72 ఏళ్ల వృద్ధుడి నిర్వాకం..
రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు 72 ఏళ్ల వృద్ధుడు. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు బాలికను మాయమాటలు చెప్పి దగ్గర్లో ఉన్న ఓ పాఠశాల భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు కానోడ్​ పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో పోలీస్​ స్టేషన్​కు చేరుకున్నారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Feb 26, 2023, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details