ముంబయి ధారావిలో ఓ ఐదేళ్ల కుర్రాడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందాడు.తన తోబుట్టువులతో కలిసి లిఫ్టులో ప్రయాణిస్తోన్న మహమ్మద్ హుజైఫా షేక్... నాలుగో అంతస్తులో ఉన్నప్పుడు లిఫ్డులో ఇరుక్కుపోయాడు. ఉన్నపలంగా లిఫ్టు ఐదో అంతస్తుకు కదిలింది. దీంతో, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా... హుజైఫా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు.
లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి - ధారావి
అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల కుర్రాడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.
![లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి elevator](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9700487-561-9700487-1606599924901.jpg)
లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి
లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందిన ఐదేళ్ల బాలుడు
కేసు నమోదు చేసుకున్న షాహునగర్ పోలీసు అధికారులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లు వెల్లిడించారు.
ఇదీ చదవండి:'రైతుల ర్యాలీలో రాజకీయ జోక్యం లేదు'