మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 18మంది మృతి - పుణె కెమికల్ ఫ్యాక్టరీ
Pune Flash - A fire broke out in a chemical company at Pirangut in the district around noon today. It is possible that some workers were trapped in the company. Three vehicles of the fire brigade have been dispatched to the spot.
22:48 June 07
19:52 June 07
రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంంలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
19:19 June 07
రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంంలో మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటికే 20 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు.
18:51 June 07
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
మహారాష్ట్ర పుణెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరి కొందరు మంటల్లో చిక్కుకున్నారు.
మంటలను ఆర్పేందుకు మూడు అగ్ని మాపక యంత్రాలను ఉపయోగిస్తున్నారు.