తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొరడాలతో కొట్టుకుంటూ.. దీపావళి వేడుకలు! - కొమరపంత దీపావళి పండుగ

దీపావళి (diwali festival celebration) అంటే ఇళ్ల ముందు దీపాలు, రంగురంగుల విద్యుత్‌ కాంతులు, టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకుంటారు. మనకు తెలిసిన దీపావళి వేడుకలు ఇలాగే ఉంటాయి. కానీ కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళి వేడుకలు వినూత్నంగా జరుపుకుంటున్నారు. కొరడాలతో కొట్టుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

diwali festival celebrations
గిరిజనుల దీపావళి

By

Published : Nov 6, 2021, 2:41 PM IST

Updated : Nov 6, 2021, 3:52 PM IST

కొరడాలతో కొట్టుకుంటూ.. దీపావళి వేడుకలు!

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా ప్రాంతంలో దీపావళి వేడుకలను (diwali festival celebration) వినూత్నంగా జరుపుకుంటున్నారు. దీపావళి రోజు పూజలు చేసి, టపాసులు పేల్చీ పండగకు ముగింపు పలుకుతారు. కానీ.. అంకోలా ప్రాంతంలోని కొమరపంతా తెగ ప్రజలు మాత్రం హోందే హబ్బా అనే ఓ ప్రత్యేక కార్యక్రమంతో వేడుకలకు ముగిస్తారు. దీపావళి రోజున ఈ తెగ ప్రజలంతా ఒక చోటుకు చేరి రెండు గ్రూపులుగా విడిపోయి (whipping tradition in diwali) కొరడాలు, అడవిలో దొరికే హోందెకాయ్‌ అనే చిన్నచిన్న కాయలతో కొట్టుకుంటారు. హోందే హబ్బా అని పిలిచే ఈ ఆటలో రెండు వర్గాలు ఎదురెదురుగా నిలబడి హోందెకాయ్‌ కాయలను విసురుకుంటూ వేడుక జరుపుకుంటారు.

ఆటకోసం గుంపులుగా వెళ్తున్న తెగ ప్రజలు

గాయాలపాలైనప్పటికీ..

హోందే హబ్బా ఆటను ఆడడంలోను కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు. ఆటలో పాల్గొనే కొమరపంతా తెగ ప్రజలు (tribal festivals) కొరడాలతో ఎదుటివారిని కోపంతో కొట్టకూడదు. కేవలం ఒక ఉత్సవం లాగానే దీన్ని భావించి ఆడాల్సి ఉంటుంది. కాయలను విసిరినప్పుడు కేవలం ఎదుటి వ్యక్తి మోకాలి కింది భాగంలో తాకే విధంగానే కొట్టాలి. మోకాలి పైకి తాకేలా కొట్టిన వారు వెంటనే ఆటనుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. మధ్యలో గాయాలపాలైనప్పటికీ సంప్రదాయం ప్రకారం దాదాపు నాలుగు గంటల పాటు ఆటను కొనసాగిస్తారు. అనంతరం అంతా కలిసి (komarapanth festivals) స్థానికంగా ఉన్న వెంకటరమణ దేవాలయంలో పూజలు నిర్వహించి పండుగకు ముగింపు పలుకుతారు.

హోందే హబ్బా ఆటలో పాల్గొన్న యువకులు

వీరత్వాన్ని ప్రదర్శించేలా..

కర్ణాటకలోని అంకోలాకు చెందిన కొమరపంతా తెగ (tribal festivals in karnataka) వారు క్షత్రియ వర్గానికి చెందినవారు. పూర్వం తమ వంశీయులు యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరిన వారని, పలు రాజవంశాల పాలనలో సైనికులుగా సేవలందించారని కొమరపంతా ప్రజలు అంటున్నారు. వీరత్వాన్ని ప్రదర్శించేలా తమ పూర్వీకులు హోందె హబ్బా సాహస క్రీడను ఆడేవారని ఆ సంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు.

హోందే హబ్బా ఆటలో ఉపయోగించే హోందెకాయ్‌ కాయలు

ఇదీ చదవండి:ఫొటో స్టూడియోలో నకిలీ పాన్​కార్డుల తయారీ.. చివరకు

Last Updated : Nov 6, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details