తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కవిపై రైతు అభిమానం.. వరిపొలంలో భారీ చిత్రపటం - తిరువళ్లువర్​ ఆకారంలో వరిపొలం

Thiruvalluvar Image In Paddy: మనం అభిమానించే వారిపై ఉన్న ఇష్టాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తుంటారు. కొందరు కటౌట్లు పెట్టి తమ.. అభిమానాన్ని చాటుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ రైతు.. తనకు ఎంతో ఇష్టమైన కవి, వేదాంతి, తత్వవేత్త అయిన తిరువళ్లువర్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటిచెప్పారు.

a farmer from Thanjavur's Malaiyappanallur sowed paddy in the image of Tamil poet Thiruvalluvar
a farmer from Thanjavur's Malaiyappanallur sowed paddy in the image of Tamil poet Thiruvalluvar

By

Published : Jul 10, 2022, 3:37 PM IST

వరిపొలంలో భారీ చిత్రపటం.. రైతు అభిమానం

Thiruvalluvar Image In Paddy: పచ్చగా ఉన్న వరిపొలాల మధ్య ఈ పొలం మాత్రం ఎండిపోయినట్లు కనిపిస్తుంది కదూ. మడి మధ్యలో కొంతభాగం మాత్రమే ఎండిపోయినట్లు ఉన్న ఈ పొలం ఓ కవిపై రైతుకు ఉన్న అభిమానానికి నిదర్శనం. ఎండిపోయిన ఈ పొలంలోనే తమిళనాడుకు చెందిన ప్రముఖకవి, తత్వవేత్త తిరుక్కరల్‌ గ్రంథ రచయిత తిరువళ్లువర్‌ చిత్రం దాగుంది.

రైతు ఇళంగోవన్​

తమిళనాడులోని మళ్లయపనూర్‌ గ్రామానికి చెందిన ఇళంగోవన్‌కు చిన్నప్పటి నుంచి ప్రముఖ కవి తిరువళ్లువర్‌ అంటే అంతులేని అభిమానం. ఆ అభిమానంతోనే తన వరి పొలంలో తిరువళ్లువర్‌ చిత్రాన్ని రూపొందించాడు. తమిళనాడు సంస్కృతిని దశదిశలా వ్యాప్తి చేసిన తిరువళ్లువర్‌ ఖ్యాతిని చాటేందుకు తన అభిమానాన్ని విభిన్నంగా చాటి చెప్పానని ఇళంగోవన్‌ తెలిపారు. వరిపొలంతో అద్భుతంగా రూపొందించిన చిత్రపటాన్ని చూసేందుకు ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తిరువళ్లువర్‌ చిత్రం అద్భుతంగా ఉందంటూ ఆ రైతుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వరిపొలంలో తిరువళ్లువర్​ చిత్రం రూపొందించిన రైతు

ABOUT THE AUTHOR

...view details