A Engineer Develops Camera For Rescue Operations : బోర్‌వెల్‌లో పడిన వారిని రక్షించటం కోసం ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ కెమెరాను తయారు చేశారు. 50 అడుగుల లోతులో ఆడియో, వీడియోలను రికార్డు చేయగలగే సామర్థ్యంతో అతి తక్కువ ఖర్చుతో కెమెరాను అభివృద్ధి చేశారు. మొదట్లో పారిశ్రామిక అవరసరాల కోసం రూపొందించాలనుకున్న ఈ పరికరం ఇప్పుడు బోర్‌వెల్‌లో పడిన వారిని రక్షించేందుకు ఉచితంగా అందించనున్నారు.
సంబల్పుర్ జిల్లాకు చెందిన ఆశిష్ మహానా బోరుబావిలో పడిన వారి కోసం తయారు చేసిన పరికరం విక్టిమ్ డిటెక్షన్ కెమెరా. దీనిని కేవలం రెండు రోజుల్లోనే రూ. 10 వేల రూపాయలతో రూపొందించారు. ఈ కెమెరాలో చిన్న మానిటర్, ఐదు మెగాపిక్సిల్ కెమెరా, 12 వోల్ట్ రీఛార్జ్ చేయగల బ్యాటరీ, మైక్రోఫోన్, బ్లూటూత్, కేబుల్, ఛార్జర్ ఉన్నాయి. ముందుగా పారిశ్రామిక అవరసరాల కోసం తయారు చేయాలనుకున్న కెమెరాను ఈ ఘటనతో బాధితులను రక్షించేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నాడు ఆశిష్ మహానా.
"రీసెంట్గా లారిపలిలో ఓ చిన్నారి బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయినట్లు తెలిసింది. రెస్క్యూ టీమ్‌తో సేవ్ చేయడం సాధ్యం కాకపోతే మరెలా?.. ఇదే విషయం నాకు తెలిసింది. దీంతో ఈ కెమెరాను డెవలప్ చేశా. ఈ కెమెరా 50 ఫీట్ల లోతు వరకూ ఉన్న వాటిని గుర్తిస్తుంది. ప్రస్తుతం చిన్న మానిటర్, బ్యాటరీ, లైట్, ఛార్జర్, కేబుల్ ఉపయోగించి కెమెరా వాడుతున్నా."
-ఆశిష్ మహానా, ఇంజినీర్