కోయంబత్తూర్ సమీపంలో ఏనుగుల గుంపును రైలు ఢీకొన్న(elephant died in train accident) ఘటనలో మరో హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. మరణించిన గుంపులో ఓ ఏనుగు గర్భంతో ఉన్నట్లు పంచనామాలో తెలింది.
తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని మధురై-కోయంబత్తూర్ ప్రాంతంలో పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగుల గుంపును శుక్రవారం అర్ధరాత్రి.. మంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు సహా.. రెండు పిల్ల ఏనుగులు ప్రాణాలు (elephant died in train accident) కోల్పోయాయి. తల్లి ఏనుగుకు 25 ఏళ్ల వయసు. మరో ఆడ ఏనుగుకు 8 ఏళ్లు ఉండగా.. మగ ఏనుగుకు 12ఏళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కేరళ పోలీసుల అదుపులో తమిళ అధికారులు..
ఈ ఏనుగుల ప్రమాద ఘటన ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఈ ప్రమాదానికి కారణమైన మంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ను నడిపిన లోకో పైలెట్లు కేరళకు చెందినవారు. వారిని విచారించడానికి చేయడానికి వెళ్లిన తమిళనాడు పోలీసు అధికారులను.. పాలక్కడ్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మళయాళీ సమాజ్ భవనం ముందు తమిళనాడుకు చెందిన తాంతై పెరియార్ ద్రవిడ కళగం, విడుతళై చిరుతైగళ్ పార్టీ సభ్యులు నిరసనలు చేపట్టాయి.