తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల ఆత్మహత్య

డాక్టర్ల దినోత్సవం రోజునే మహారాష్ట్ర పుణెలో వైద్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇరువురి మధ్య ఫోన్​లో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

A doctor couple from Pune committed suicide
యువ వైద్యుల ఆత్మహత్య

By

Published : Jul 1, 2021, 7:28 PM IST

డాక్టర్ల దినోత్సవం రోజునే మహారాష్ట్ర పుణెలో విషాదకర ఘటన జరిగింది. వైద్యులైన నవ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నికిల్​ షేండకర్​(27), అంకిత నికిల్​ షేండకర్​(26)లు ఇటీవలే వివాహం చేసుకుని పుణెలోని వావండి పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నారు. అంకిత.. మానసిక వైద్యురాలు. నికిల్​ ఆయుర్వేద వైద్యుడు. ఇద్దరు వేరువేరు చోట్ల విధులు నిర్వర్తించేవారు. డాక్టర్ల దినోత్సవం రోజున విధులు నిర్వహించుకుని వస్తుండగా.. నికిల్​, అంకిత ఫోన్​లో వాగ్వాదం చేసుకున్నారు. నికిల్ ఇంటికి వచ్చేలోపే అంకిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

యువ వైద్యుల ఆత్మహత్య

సాధారణంగా ఇంటికి వచ్చిన నికిల్​.. అంకితను చూసి నిర్ఘాంతపోయాడు. అనంతరం అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details