బంగాల్ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో భాజపా, టీఎంసీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. టీఎంసీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తొలుత భాజపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఈసీకి భాజపా, టీఎంసీ పోటాపోటీ ఫిర్యాదులు - భాజపా ఆరోపణలు
తొలి దశ పోలింగ్ నేపథ్యంలో బంగాల్ భాజపా, టీఎంసీ నేతలు పరస్పరం అరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు.
భాజపా, టీఎంసీ నేతల పరస్పర ఫిర్యాదులు
ఈ ఆరోపణల నేపథ్యంలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఈసీకి లేఖ రాశారు. ఓటింగ్ శాతంలో తేడాలున్నాయని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి:కర్ణాటక సీడీ కేసులో వరుస ట్విస్ట్లు