దేశంలో రెండు కరోనా నిరోధక టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేయడం శుభ పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి రావడం కరోనాపై పోరులో కీలక మలుపుగా, గొప్ప ముందడుగుగా ప్రధాని అభివర్ణించారు.
'టీకాల అనుమతి కొవిడ్ పోరులో గొప్ప మలుపు' - Covishield news
కరోనా నిరోధక టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లకు డీసీజీఐ ఆమోదం తెలపడం నిర్ణయాత్మక మలుపని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌ను ఆరోగ్యవంతంగా, కొవిడ్ రహితంగా మార్చేందుకు ఈ టీకాలు దోహదం చేస్తాయన్నారు.
'టీకాల అనుమతి కొవిడ్ పోరులో గొప్ప మలుపు'
భారత్‌ను ఆరోగ్యవంతంగా, కొవిడ్ రహితంగా మార్చేందుకు ఈ టీకాలు దోహదం చేస్తాయన్నారు మోదీ. వ్యాక్సిన్ల కోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీజీఐ అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు దేశీయంగా తయారవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మోదీ ట్వీట్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కలను నెరవేర్చే దిశగా శాస్త్రవేత్తల చేస్తోన్న కృషిని ఆయన కొనియాడారు.