కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌పై వస్తున్న అపోహలను నమ్మొద్దని ప్రజలను కోరింది. జనవరి 16న ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 580 ప్రతికూల ఘటనలను ప్రభుత్వం గుర్తించామని.. అస్వస్థతకు గురైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
మూడో రోజు 1.48 లక్షల మందికి..
మూడో రోజు దేశవ్యాప్తంగా మరో 1,48,266 మంది టీకా వేయించుకున్నట్లు వివరించింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు మొత్తం 3,81,305 మంది వ్యాక్సినేషన్ క్రతువులో భాగం అయినట్లు తెలిపింది. నేడు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.48 లక్షల మంది టీకా వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అడిషినల్ సెక్రెటరీ మనోహర్ అగ్నాని తెలిపారు.
- బిహార్‌లో 8,656
- అసోంలో 1,822
- కర్ణాటకలో 36,888
- కేరళలో 7,070
- మధ్యప్రదేశ్‌లో 6,665
- తమిళనాడులో 7,628
- తెలంగాణలో 10,352
- బంగాల్లో 11,588
- దిల్లీలో 3,111
ఇదీ చూడండి: 'కొవిడ్ టీకాల పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు'