Encounter in Bijapur: ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. బసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
బీజాపుర్‌లో ఎన్కౌంటర్- సీఆర్‌పీఎఫ్ అధికారి మృతి
Encounter in Bijapur: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారు.
డొంగల్ చింతా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో రహదారి భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్ సిబ్బంది పైకి మావోయిస్టులు కాల్పులకు పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరగ్గా కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అప్పారావు అనే జవాన్ గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనాస్థలిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు..
ఇదీ చూడండి:కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులకు యూజీసీ అనుమతి