కొవిడ్ చికిత్సా కేంద్రంలో.. కరోనా సోకిన ఓ జంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్ బలోద్లో శనివారం జరిగింది. ఆస్పత్రిలో ఇంటి వాతావరణం కనిపించేలా ప్రత్యేకంగా అలంకరించారు. సిబ్బంది, రోగులు అందరూ అభినందిస్తుండగా.. వారిద్దరూ ఏడడుగులు నడిచారు.
"ఓ జంట తాము ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకుంటామని అడిగింది. అందుకే.. ఆస్పత్రిలో ఇల్లు లాంటి భావన కలిగించేలా మేం ఈ వివాహాన్ని జరిపించాం. సిబ్బంది, రోగులు చుట్టూ ఉండగా కుటుంబ వేడుకలాగా ఈ కార్యక్రమం జరిగింది" అని ఈ చికిత్సా కేంద్రాన్ని నిర్వహించే జైన్ కమ్యూనిటీ అధ్యక్షుడు చెప్పారు.