రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్. 'వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుంది' అని అన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకు పైగా ఉద్రిక్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్న కర్షకులకు ఇదివరకే మద్దతు తెలిపిన కమల్.. రైతులను 'అన్నదాతలు'గా పేర్కొన్నారు.
"వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుంది. మన దేశంలో అలా జరగదని నమ్ముతున్నాను. రైతులు 'అన్నదాతలు'" అని కమల్ అన్నారు.