తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ - ఆర్​ఎస్​ఎస్ ప్లాన్

బంగాల్​లో భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి తీవ్రంగా గాయాలయ్యాయి.

BJP vs TMC
కార్యకర్తల ఘర్షణ, బంగాల్​ హింస

By

Published : May 20, 2021, 5:00 AM IST

బంగాల్​ ఆసన్​సోల్ ప్రాంతంలోని జమూరియలో భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

గాయాలతో కార్యకర్త
బాంబు దాడి ఆనవాళ్లు

ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబు దాడి జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కార్యకర్తకు తీవ్ర గాయాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఆర్​ఎస్ఎస్​​ సన్నాహాలు!

శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం బంగాల్​లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ కార్యకర్తలను కాపాడుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలిపింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.

ముఖ్యంగా సంఘ్​లోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్​ఎస్​ఎస్​ సీనియర్ నేత ఒకరు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను టీఎంసీ తిప్పికొడుతోంది. తమ పార్టీ కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని చెబుతోంది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో కలెక్టర్ సైక్లింగ్​- అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్

ABOUT THE AUTHOR

...view details