Special Discount for Sunny Leone Fans: నటి సన్నీ లియోనీ అభిమానులకు బంపర్ ఆఫర్! కర్ణాటకలోని ఓ చికెన్ సెంటర్లో సన్నీ ఫ్యాన్స్‌కు 10శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు షాప్ యజమాని. మండ్యలోని నురాడీ రోడ్లో ఈ దుకాణం ఉంది. ఏడాదంతా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు షాప్ ఓనర్ ప్రసాద్.
అయితే సన్నీ లియోనీ ఫ్యాన్స్ అని నోటితే చెప్పేస్తే సరిపోదు. అందుకు మూడు షరతులు విధించారు ప్రసాద్. ఈ కండిషన్లను పూర్తి చేస్తేనే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అవేంటంటే..
మొదటిది:ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సన్నీ లియోనీని ఫాలో కావాలి.
రెండోది:మొబైల్ ఫోన్లలో సన్నీవి కనీసం 10 ఫొటోలైనా ఉండాలి
మూడోది:సన్నీలియోనీ అన్ని ఫొటోలపై లైక్, కామెంట్ చేయాలి