ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్సొర పోలీస్స్టేషన్ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం! - బొడోకెందుగుడ
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలహండి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం!
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భారీ మలుపును డ్రైవర్ గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.