తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాటుబాంబు పేలి- చూపు కోల్పోయిన బాలుడు - టపాసుల పేలుడులో కనుచూపు కోల్పోయిన బాలుడు

అంత్యక్రియల్లో పేల్చిన నిషేధిత నాటు బాంబుతో(country bomb explosion) ఓ బాలుడి కంటిచూపు పోయింది. ఈ ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది.

country bomb chennai
టపాసుల కాల్చివేత

By

Published : Nov 20, 2021, 10:11 PM IST

అంత్యక్రియల్లో పేల్చిన నిషేధిత నాటుబాంబు (country bomb explosion) కారణంగా ఓ బాలుడికి కంటిచూపు దూరమైంది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. నగర శివారులోని జఫర్​ఖాన్​ పేటలో నివాసం ఉంటున్న బాలుడు సంతోష్​(14) తన సోదరిని కళాశాల నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. పక్క వీధిలో ఓ షాప్​ వద్ద కొంతసేపు కూర్చున్నాడు. ఇంతలో ఓ కుటుంబం.. వృద్ధురాలి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని రోడ్డు మీద తీసుకెళ్లింది. అదే సమయంలో భారీగా టపాసులు పేల్చారు. ఈ క్రమంలో ఓ నాటుబాంబు పేలడం వల్ల పక్కనే ఉన్న రాయి ఎగిరి అక్కడ కూర్చున్న బాలుడి కంటికి బలంగా తగిలింది. నొప్పితో అతడు విలవిలలాడాడు. బాలుడ్ని అస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి.. కంటిచూపు పోయిందని వైద్యులు తెలిపారు.

కంటిచూపు కోల్పోయిన బాలుడు

బాలుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తన సోదరుడి కంటి ఆపరేషన్​కు సహాయం చేయాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చదవండి:బాలికపై లైంగిక వేధింపులు.. లేఖ రాసి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details