గుడి ముందు ఉంటూ... వచ్చిపోయే భక్తులు భిక్షగా వేసిన ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి రూ. 20 వేలుగా చేసింది. ఇలా వచ్చిన మొత్తాన్ని గుడిలో దేవునికే దానంగా ఇచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది. ఆమె కూడ బెట్టి ఇచ్చిన మొత్తాన్ని చూసిన ఆలయ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు.
యాచకురాలి గొప్ప మనసు.. గుడికి రూ.20వేల విరాళం
దాతలు భిక్షం వేసిన ప్రతీ రూపాయిని కూడబెట్టుకుంది ఆమె. తన అన్నపానీయాలకు పోగా మిగిలిన సొమ్మును పెద్దమొత్తంగా దాచింది. ఒక్కొక్క రూపాయిని నోట్లుగా మార్చింది. దానితో ఆమె అవసరాలను తీర్చుకోవాలి అనుకోలేదు. భిక్షం ఎత్తుకోవడం వృత్తి అయినా.. మనసు గొప్పదని రుజువు చేసుకుంది. తాను రోజు బిక్షం ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు రూ. 20 వేలు దానంగా ఇచ్చింది ఆ వృద్ధురాలు. ఈ ఘటన కర్ణాటక చిక్కమంగుళూరులో జరిగింది.
గుడికి దానం ఇచ్చిన వృద్ధురాలుతో ఆలయకమిటి సభ్యులు
స్థానికంగా ఉండే పటాల ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సొమ్మును ముట్టజెప్పాలని అనుకుంది ఆ వృద్ధురాలు. ఆమె ఆలయంలోకి ప్రవేశించేది చూసి కమిటీ సభ్యులు భిక్షం కోసం అని భావించి బయటకు వెళ్లమని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన దగ్గర ఉన్న 40 రూ.500 నోట్లను వారికి చూపించి ట్రస్ట్‌కు దానంగా ఇచ్చింది. ఆ మొత్తంతో ఆంజనేయ స్వామికి వెండి ఫేస్ మాస్క్ కొనిమని చెప్పింది.
ఇదీ చూడండి:డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి