తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శృంగారం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

60 year old man died during sex: ఓ మహిళతో సెక్స్​ చేస్తూ ఉండగా 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ముంబయిలోని ఓ హోటల్​లో జరిగింది. కాగా మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

60 year old man died during sex
60 year old man died during sex

By

Published : May 24, 2022, 9:16 AM IST

60 year old man died during sex: ముంబయిలో షాక్​కు గురిచేసే ఘటన జరిగింది. ఓ హోటల్‌ గదిలో మహిళతో లైంగిక చర్యలో ఉండగా ఓ వృద్ధుడు (61) ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అతడి మరణానికి తక్షణ కారణాలేమీ తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధుడు సబర్బన్‌ కుర్లాలోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం 10గంటల సమయంలో 40 ఏళ్ల మహిళతో కలిసి గది తీసుకున్నాడు. ఆమెను తన ప్రేయసిగా పేర్కొన్నాడు. ఆ తర్వాత కొంత సయమానికి హోటల్‌ రిసెప్షన్‌కు ఆ మహిళ ఫోన్‌ చేసి.. వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడని, ఎలాంటి స్పందన లేదని చెప్పింది. దీంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని కుర్లా పోలీసులు వెల్లడించారు.

అనంతరం ఆ మహిళను కుర్లా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా.. వృద్ధుడు వర్లి ప్రాంతానికి చెందిన వాడని, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, లైంగిక చర్యలో ఉండగా వృద్ధుడు మద్యం తాగేందుకు ప్రయత్నించాడని, కానీ అచేతన స్థితిలో పడిపోయాడని చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ (యాక్సిడెంటల్‌ డెత్ రిపోర్టు)గా కేసు నమోదు చేశామని, వృద్ధుడి మరణానికి కచ్చితమైన కారణాలు, లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందు అతడు ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకున్నాడా అనే విషయం తెలుసుకొనేందుకు వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details