దివ్యాంగురాలైన 16 ఏళ్ల యువతిపై ఓ డాక్టర్ అత్యాచారం చేశాడు. ఫిజియోథెరపీ చికిత్స పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నిందితుడు హరీశ్‌పై కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది...
దివ్యాంగురాలైన ఓ యువతి చికిత్స కోసమని ముంబయిలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉండే హరీశ్ అనే వైద్యుడి దగ్గరకు 2016 నుంచి వస్తుండేది. అయితే ఫిజియోథెరపీ పేరుతో అక్టోబర్ 2019 నుంచి మార్చి 2021 వరకు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఇది చికిత్సలో భాగంగా భావించిన యువతి పట్టించుకోలేదు. అయితే ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాధితురాలు.. తల్లికి మెసేజ్‌ల రూపంలో వివరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై శాంటాక్రూజ్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేసి.. నిందితుని కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:భారీగా హిమపాతం.. ముగ్గురు పర్వతారోహకులు మృతి