తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖాళీ భవనంలో యువతి మృతదేహం- హత్యాచారమా? - Maharashtra rape cases

మహారాష్ట్రలోని(Maharashtra crime news) ఖాళీ భవనంలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతురాలిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

women raped and killed
హత్యాచారం

By

Published : Nov 27, 2021, 12:59 PM IST

మహారాష్ట్ర ముంబయి నగరంలోని కుర్లా ప్రాంతంలో 20 ఏళ్ల యువతి దారుణ హత్యకు(Maharashtra crime news) గురైంది. ఖాళీ భవనంలోని 13వ అంతస్తులో ఆమె మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. నిందితులు అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతురాలు ఎవరన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఎలా తెలిసిందంటే..

ఓ యువకుడు తన మిత్రులతో కలిసి ఆ భవనంలో వీడియో షూటింగ్​ వెళ్లిగా.. అక్కడ మృతదేహం చూసి కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తలపై తీవ్ర గాయాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భవనంలోకి మృతురాలు ఎవరితో వెళ్లిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపిన అధికారులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details