తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kuppuru swamiji: మఠాధిపతిగా 13 ఏళ్ల బాలుడు

13 ఏళ్ల బాలుడు ఓ మఠానికి అధిపతిగా ఎంపికయ్యాడు. (Kuppuru gadduge samsthana mutt) కొవిడ్​తో మరణించిన యతింద్ర శివాచార్య స్వామీజీ (Kuppuru swamiji) వారసుడిగా బాలుడిని ఎంపిక చేశారు.

Kuppuru swamiji
మఠాధిపతిగా 15 ఏళ్ల బాలుడు

By

Published : Sep 27, 2021, 8:11 PM IST

కర్ణాటకలోని కుప్పూరు గడ్డుగే మఠాధిపతిగా (Kuppuru gadduge samsthana mutt) 13 ఏళ్ల బాలుడు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు ఈ మఠాధిపతిగా ఉన్న యతింద్ర శివాచార్య స్వామీజీ కొవిడ్ కారణంగా సెప్టెంబర్ 25న కన్నుమూశారు. (Kuppuru mutt Swamiji death) దీంతో 13 ఏళ్ల తేజస్ కుమార్​ను స్వామీజీ వారసుడిగా ప్రకటించారు.

తేజస్ కుమార్

తుమకూరు జిల్లాలోని చిక్కనకనహళ్లి తాలుకాలో ఈ మఠం ఉంది. మఠాధిపతి (Kuppuru swamiji) అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుమకూరు జిల్లా ఇంఛార్జి మంత్రి జేసీ మధుస్వామి, ఇతర మఠాల అధిపతుల సమక్షంలో కొత్త మఠాధిపతిని ఎంపిక చేశారు. చివరకు, యతింద్ర స్వామి అంత్యక్రియలను తేజస్ చేతుల మీదుగా జరిపించారు.

తేజస్ కుమార్​తో మఠం సభ్యులు

2008 ఏప్రిల్ 22న జన్మించాడు తేజస్ కుమార్. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మైసూరులోని సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది.

.

ఇదీ చదవండి:ఈ బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!

ABOUT THE AUTHOR

...view details