మహారాష్ట్ర వాసాయి రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు.. ప్రాణాలకు తెగించి బాలుడిని రక్షించాడు. 12 ఏళ్ల బాలుడు రైల్వే ప్లాట్‌ఫాంపై వెళ్తూ.. పట్టాలపై పడ్డాడు. ఇది గమనించిన రమేశ్ నగార్ అనే ప్రయాణికుడు బాలుడిని కాపాడేందుకు కిందకు దిగాడు. అదే సమయంలో రైలు వచ్చింది. దీంతో రైల్వే గార్డు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బాలుడు, రమేశ్ రైలు కిందే ఉండిపోయారు.
రైలు కింద బాలుడు.. చాకచక్యంగా రక్షించారిలా... - రైలు ప్రమాదం నుంచి బాలుడిని కాపాడిన ప్రయాణికుడు
ప్రాణాలకు తెగించి బాలుడిని రైలు ప్రమాదం నుంచి రక్షించాడు ఓ ప్రయాణికుడు. ఈ ఘటన మహారాష్ట్ర వాసాయి రైల్వే స్టేషన్లో జరిగింది. రైల్వే సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాలకు తెగించి.. బాలుడిని రక్షించి
రైల్వే పోలీస్, గార్డ్స్ సహాయంతో.. బాలుడిని రమేశ్ బయటకు తీసకొచ్చాడు. రైల్వే పోలీసులు ఇద్దరికీ.. ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్