హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో కొవిడ్-19 కోరలు చాచింది. కనీసం 99 మంది విద్యార్థులు, 23 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు.
ఒకే పాఠశాలలో 99 మంది విద్యార్థులకు కరోనా! - చంబా వార్తలు
హిమాచల్ ప్రదేశ్లోని ఓ పాఠశాలలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 99 మంది విద్యార్థులు, 23 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.
99 విద్యార్థులు, 23 మంది సిబ్బందికి కరోనా
కొవిడ్ బారిన పడిన వారిని ఐసోలేషన్లో ఉంచినట్లు డిప్యూటీ కమిషనర్ రాణా తెలిపారు. వారు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో కొత్తగా 47వేల మందికి కరోనా