దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో మరో అనూహ్య ఘటన వెలుగుచూసింది. హరిద్వార్ కుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్యప్రదేశ్ ప్రజల్లో.. దాదాపు 99 శాతం మందికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. తాజాగా విదిశ జిల్లా గ్యారస్పుర్కు చెందిన 60 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
గ్యారస్పుర్ నుంచి మహా కుంభ్‌కు హాజరైన 83 మందిలో 60 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మిగతా 22 మంది కోసం గాలిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 15 మధ్య వేరు వేరు వాహనాల్లో ఈ 83 మంది కుంభమేళాకు ప్రయాణమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా తేలడం వల్ల కుంభ్‌కు హాజరైన వారు క్వారంటైన్‌లోనే అండాలని సూచించారు.