తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విలయం- ఒక్కరోజే 63వేల మందికి కరోనా

దేశంలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 63,309 మందికి కరోనా సోకింది. కర్ణాటకలో 39,047 మంది వైరస్ బారిన పడ్డారు.

Maharashtra, cases
'మహా' విలయం- ఒక్కరోజే 63,309 మందికి వైరస్

By

Published : Apr 28, 2021, 9:55 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒక్క రోజే 63,309 మందికి కరోనా సోకింది. 985 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే 4,966 మంది వైరస్ బారిన పడ్డారు.

స్వీయ నిర్బంధంలోకి అశోక్​ గహ్లోత్..

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బుధవారం ఆయన భార్య సునీతా గెహ్లోత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివిధ రాష్ట్రాలలో బుధవారం ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులు

రాష్ట్రం కరోనా కేసులు మరణాలు
కర్ణాటక 39,047 229
కేరళ 35,013 41
గుజరాత్ 14,120 174
మధ్యప్రదేశ్ 12,758 105
ఉత్తర్​ప్రదేశ్​ 29,824 266
రాజస్థాన్ 16,613 120
బంగాల్​ 17,207 77

ABOUT THE AUTHOR

...view details