దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో(petrol hike news) సామాన్యులు కుదేలవుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీ(upendra tiwari news) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. 'ఇంధన ధరల పెంపు విషయానికొస్తే అసలు 95 శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే కార్లు వినియోగిస్తున్నారు,' అని వ్యాఖ్యానించారు. '2014కు ముందు, ప్రస్తుత ఇంధన ధరలను పోల్చుతున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం వచ్చాక పౌరుల తలసరి ఆదాయం కూడా రెండింతలయింది కదా!' అని పేర్కొనడం గమనార్హం. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వేరే ఏ సమస్య లేనందునే దీనిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
'తలసారి ఆదాయంతో పోల్చితే తక్కువే'