తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటింటా 'కాల్‌'నాగులు.. సైబర్ నేరాలకు అడ్డాగా ఎడారి రాష్ట్రం - cyber gangs from bhartpur

ఇంటింటా 'కాల్‌'నాగులు.. ఊరూరా సైబరాసురులు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు (online frauds in india) కేంద్రం. రాజస్థాన్‌లోని వెనుకబడిన జిల్లా భరత్‌పుర్‌లో వందల ఊళ్లు నేరగాళ్లకు (cyber gangs) నిలయం. నేరగాళ్లు అక్కడి నుంచి దేశంపై దండెత్తుతున్నా పోలీసులు కిమ్మనడంలేదు.

online frauds in india
ఆన్​లైన్​ చోరీలు

By

Published : Oct 17, 2021, 6:46 AM IST

Updated : Oct 17, 2021, 7:10 AM IST

అదో దొంగల రాజ్యం.. అరాచకమే (online frauds in india) అక్కడి రాజ్యాంగం.. ఊళ్లన్నీ నేరగాళ్ల మయం. దేశమంతా వారికి భాండాగారం.. ఫోన్‌ చేసి దోచుకుంటారు. పట్టుకునేందుకు పోలీసులు వస్తే తుపాకులు ఎక్కుపెడతారు. అక్కడి ఒక్క నేరగాణ్ని పట్టుకోవాలన్నా పోలీసులు యుద్ధానికి వెళ్తున్నట్లుగా సన్నద్ధం కావలసిందే. ఏమాత్రం తేడా వచ్చినా (online frauds in india 2021) ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. చట్టానికి అక్కడ విలువలేదు. పోలీసుల్నే పట్టి బంధించే ఘరానా నేరగాళ్ల స్థావరమది. 'కాల్‌' నేరాలకు (cyber cell complaints) అదే రాజధాని. నేరగాళ్లు అక్కడి నుంచి దేశంపై దండెత్తుతున్నా పోలీసులు కిమ్మనడంలేదు. అదే భరత్‌పుర్‌!

రాజస్థాన్‌లోని వెనుకబడిన జిల్లా భరత్‌పుర్‌లో వందల ఊళ్లు నేరగాళ్లకు నిలయం. పోలీసులు కూడా కాలుపెట్టలేని జిహింజ్‌పురి, బిలంక, గడ్‌జీత్‌పట్టీ, కీడాబాంసోలి, గొగోర్‌, గుర్‌పుడి, అభయ్‌పుర్‌, చెలక్‌ గ్రామాల్లో 'ఈనాడు' పర్యటించింది. దేశంలో ఇంకా అలాంటి ప్రాంతాలున్నాయంటే నమ్మలేం. ఒకప్పుడు థగ్గులు, పిండారీలనే దారిదోపిడీ తెగలు ఉండేవి. అలాంటి దోపిడీల వారసులుగా ఆధునిక సాంకేతికతతో దేశవ్యాప్తంగా సామాన్యులను దోచుకుంటున్న ముఠాలకు కేంద్రమది.

భరత్‌పుర్‌లో వందల ఊళ్లు నేరగాళ్లకు నిలయం

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌, ఆల్వార్‌, హరియాణాలోని నూహ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాల మధ్య విస్తరించి ఉన్న మేవత్‌ ప్రాంతంలోని వందల గ్రామాలలో ఎక్కువ మందికి ఇప్పుడు సైబర్‌ నేరాలే ఉపాధి. వీటన్నింటిలోనూ భరత్‌పుర్‌ మరింత ప్రమాదకరం. ఓఎల్‌ఎక్స్‌లో వాహనాలు, వస్తువులను పెట్టి కారు చౌకగా విక్రయిస్తామని నమ్మిస్తారు. ఎవరైనా కొనడానికి సిద్ధపడితే వారి నుంచి మొదట కొంత అడ్వాన్స్‌ కట్టాలని నమ్మించి సొమ్ము లాగేసి మాయమవుతారు. అలాగే (online frauds and scams) బహుమతుల పేరుతో మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపి.. ఓటీపీ తెలుసుకుని ఖాతాలను కొల్లగొట్టడం.. ఇలా ఒకరకమని కాదు. ఎలాంటి సైబర్‌ నేరానికైనా పాల్పడే ముఠాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాంతంలోని ఊళ్లన్నీ శత్రుదుర్భేద్యాలే. గగోర్‌ లాంటి ఊళ్లలోకి పోలీసులూ వెళ్లలేరు. శివార్లలో పిల్లల్ని కాపలా పెడతారు. కొత్తవారు కానీ, ఇతర రాష్ట్రాల నంబర్లున్న వాహనాలు కానీ కనిపిస్తే నేరగాళ్లకు సమాచారం తెలిసిపోతుంది. ఎదుర్కొనేందుకు ఊరంతా సిద్ధమవుతుంది. ప్రతి ఇంటి మీద రాళ్ల కుప్పలు, కారపు పొట్లాలు సిద్ధంగా ఉంటాయి. ఒకవేళ పోలీసులు దాడి చేస్తే మహిళలు రాళ్లు విసిరి కారం చల్లుతారు. గత ఏడాది హైదరాబాద్‌ సీసీఎస్‌కు చెందిన పోలీసులు గగోర్‌ గ్రామానికి వెళ్లినప్పుడు నేరగాళ్లు ఏకంగా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అప్పటికీ కుదరకపోతే తుపాకులు బయటకు తీస్తారు.

మైలురాళ్లు లేవు

ఇక్కడున్న నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ నేరాలకు పాల్పడుతుంటారు. ఆయా రాష్ట్రాల పోలీసులు వీరిని పట్టుకునేందుకు వస్తే దారీతెన్నూ తెలియకుండా ఉండేందుకు మైలురాళ్లు పీకేశారు. కొత్తవారు వస్తే ఎటు వెళ్లాలో తెలియదు. ఒకవేళ స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటే ఆ సమాచారం వెంటనే నేరగాళ్లకు తెలిసిపోతుంది. ప్రతి పోలీస్‌స్టేషన్లోనూ సైబర్‌ నేరగాళ్ల సహచరులు ఉంటారు. ఊళ్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు కూడా వేగులుగా పనిచేస్తుంటారు. కొత్త వ్యక్తులు కనిపించగానే వీరు అప్రమత్తమవుతారు. ‘ఈనాడు ప్రతినిధి’ కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు అనేకచోట్ల ఆపారు. కొవిడ్‌ సర్వే కోసం వచ్చామని చెబితే వదిలేశారు.

రిమోట్‌ ఆపరేటింగ్‌ గేట్లు

పోలీసుల ప్రయత్నాలు

కాలు కదపకుండా కేవలం ఫోన్ల ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్న నేరగాళ్లు అనేక అధునిక హంగులు సమకూర్చుకున్నారు. ఇందులో ప్రధానమైంది రిమోట్‌ ఆపరేటింగ్‌ గేట్లు. అనేక గ్రామాలకు ఈ గేట్లు ఉంటాయి. ఊరి శివార్లలో కాపలా కాసే వేగులు కొత్త వ్యక్తులు కనిపించగానే సమాచారం ఇస్తారు. వెంటనే గేట్లు మూసుకుపోతాయి. ఎవరైనా అనుమానాస్పదంగా వెళితే చాలు శివార్లలో కాపలా కాస్తున్న వారు వెంటపడి తరుముతారు. భరత్‌పుర్‌ జిల్లాలోని కామ, పహాడీనగర్‌, గోపాల్‌గఢ్‌, సిక్రీ, ఖేత్వాడ్‌, జురెహర సమితుల పరిధిలోని 150-200 గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ సైబర్‌ నేరాలకు పాల్పడుతుంటారు. ఈ గ్రామాలకు వెళ్లే రహదారులు ఘోరంగా ఉంటాయి. పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే గంటకు పైగా పడుతుంది. అడుగడుగునా గోతులు, వాటిపైకి నీళ్లు పారిస్తుండటంతో బురద ఆవరిస్తుంది. పోలీసులు గ్రామాల్లోకి రాకుండా, ఒకవేళ వచ్చి, ఎవరైనా నిందితుల్ని పట్టుకున్నా తిరిగి వెళ్లకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు.

పోలీసులపై దాడులు

ధ్వసమైన కారు
  • 2020 జులైలో దిల్లీ నుంచి వచ్చిన పోలీసు బృందంలో 8 మందిని కోహ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో బంధించారు. రాళ్లతో దాడి చేయగా అనేకమంది పోలీసులు గాయపడ్డారు.
  • అదే ఏడాది దిల్లీ నుంచి వచ్చిన పోలీసులపై గగోర్‌ గ్రామస్థులందరూ కలిసి రాళ్ల దాడి చేశారు. కళ్లలో కారంపొడి చల్లి వెళ్లకొట్టారు.
  • నకల్‌కుందన్‌ గ్రామంలో ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు 60 మంది పోలీసుల బృందం వెళ్లినప్పుడు గ్రామస్థులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ ఏడుగురు సభ్యుల ముఠాను పట్టుకోగలిగారు.
  • కామ తాలూకాలోని ఖెర్లీనానూ గ్రామంలో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన దిల్లీ పోలీసులపై కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు.
  • లేవ్‌డా గ్రామంలో నర్గీస్‌ఖాన్‌ అనే ఎస్సైని బందీగాపట్టుకున్నారు. ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపాక 3రోజులకు వదిలేశారు. ప్రస్తుతం ఎవరినైనా పట్టుకునేందుకు పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్‌జాకెట్లు, ఆధునిక ఆయుధాలతో వెళ్తుంటారు.

ఇదీ చదవండి:నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు

Last Updated : Oct 17, 2021, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details