దిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికను హత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. ఆ ప్రాంతానికి సమీపంలోని కాటికాపరే ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది
బాధితురాలు.. ఆదివారం సాయంత్రం నీళ్ల కోసం బయటకు వెళ్లింది. చాలా సమయం వరకు.. ఇంటికి రాలేదు. అయితే సాయంత్రం 6 గంటలకు సమీపంలోని కాటికాపరి.. బాధితురాలి తల్లిని శ్మశానవాటికకు పిలిచి.. బాలిక మృతిదేహాన్ని చూపించాడు. నీళ్లు పడుతుండగా విద్యుదాఘాతానికి గురై.. చనిపోయినట్లు చెప్పాడు. అనంతరం కుటుంబ సభ్యులను తికమకపెట్టి.. ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లవద్దని.. తీసుకెళ్తే పోలీసుల వచ్చి.. పోస్టుమార్టం చేసి అవయవాలు తీసేస్తారని చెప్పాడు. వెంటనే అంతిమ సంస్కారాలు చేయాలని ఒత్తిడి చేశాడు. అయితే ఇందుకు అంగీకరించని కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు.