రాజస్థాన్ ఝలావర్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15ఏళ్ల బాలికపై.. తొమ్మిది మంది.. 8 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.
వారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక.. శుక్రవారం ఇంటికి చేరిందని, అనంతరం కుటంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
"ఫిబ్రవరి 25న, స్కూల్ బ్యాగు కొనిస్తానని చెప్పి.. తన స్నేహితుడు బుల్బుల్ మరో వ్యక్తితో కలిసి.. తనను ఝలావర్ నగరానికి తీసుకెళ్లినట్టు బాధితురాలు చెప్పింది" అని సుకేత్ డీఎస్పీ మంజీత్ సింగ్ వెల్లడించారు.