హిమాచల్‌ప్రదేశ్ సిర్మోర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్లి వస్తోన్న ఓ కారు షిల్లైలోని పాశోగ్ లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
లోయలో పడ్డ కారు- 9 మంది మృతి - హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
![లోయలో పడ్డ కారు- 9 మంది మృతి road accident in himachal pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12291315-thumbnail-3x2-yv.jpg)
హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
18:35 June 28
HIMACHAL
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా మృతదేహాలను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రధాని సంతాపం..
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని.. గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు.
Last Updated : Jun 28, 2021, 10:35 PM IST