భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. వరద నీరు చేరటం వల్ల నీలంబూర్ జిల్లాలోని చలియార్ నది పొంగిపొర్లుతోంది. మలప్పురంలో.. నది అవతలి గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 200 మందిని ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇదే సమయంలో గ్రామంలో చిక్కుకున్న తొమ్మిదినెలల గర్భిణీ రాధిక, మరో యువతి సింధును విపత్తు నిర్వహణ బృందం రక్షించింది.
వరదలో చిక్కుకున్న నిండు గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ - 9 month pregnant rescued in kerala
నిండు గర్భిణీని నది దాటించింది విపత్తు నిర్వహణ బృందం. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న నది నుంచి పడవలో ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటన కేరళ నీలంబూర్లో జరిగింది.

వరదల నుంచి రక్షించిన అధికారులు
గర్భిణీని వరదల నుంచి రక్షించి
ఉప్పొంగతున్న నది నుంచి పడవల ద్వారా ఒడ్డుకు చేర్చిన రాధికను పునరావాస కేంద్రానికి తరలించగా.. సింధును స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి