ఓ 9 నెలల పసికందు ప్రాణాలను దిల్లీ వైద్యులు కాపాడారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ఛాలెంజ్‌గా స్వీకరించి..
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఇరాక్‌కు చెందిన 9 నెలల చిన్నారి హమద్‌కు జనవరి 3న కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. అంత చిన్న వయస్సువారికి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం అత్యంత క్లిష్టమైన పని. కానీ, దీన్ని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఛాలెంజ్‌గా స్వీకరించి, చిన్నారిని కాపాడారు. డాక్టర్ శైలేంద్ర లాల్వానీ నేతృత్వంలోని వైద్య బృందం 9 గంటల పాటు శ్రమించి ఈ సర్జరీని పూర్తి చేసింది.