తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పడవ ప్రమాదంలో 9 మంది మృతి - bengal boat capsize news

బంగాల్​లో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మరణించారు. పడవ నడుపుతున్న ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన మరొకరి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.

BENGAL CAPSIZE
పడవ ప్రమాదంలో 9 మంది మృతి

By

Published : Jul 15, 2021, 4:04 PM IST

Updated : Jul 15, 2021, 4:32 PM IST

మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు

బంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన 9మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. బక్‌కాలీ తీరంలో ఉన్న రక్తేశ్వరీ దీవి వద్ద బుధవారం.. హైమావతి అనే పడవ ప్రమాదానికి గురైంది. చేపలు పట్టిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో భారీఎత్తున అలలు ఎగసిపడటం వల్ల పడవ మునిగిపోయింది.

సహాయక చర్యలు
.

ఒక్కసారిగా అలలు విరుచుకుపడగానే.. పడవ నడుపుతున్న ఇద్దరు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మిగతా వారు నిద్రిస్తున్నారని వెల్లడించారు. నిద్రలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గల్లంతైన ఓ వ్యక్తికోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి'

Last Updated : Jul 15, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details