భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తయారుచేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేయడానికి తొమ్మిది ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ మిస్సైల్స్ ను విక్రయించడానికి ఏర్పాట్లు మొదలు కానున్నట్లు వెల్లడించాయి.
5 బిలియన్ డాలర్ల రక్షణ రంగ ఆయుధాల ఎగుమతికి బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మిత్ర దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతం కోసం ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి.