తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్​ కేసులు- రాజస్థాన్​లో 9 మందికి వైరస్​​ - గుజరాత్​ ఒమిక్రాన్ కేసులు

राजस्थान में ओमीक्रोन ने दस्तक दे दी है. रविवार को राजधानी जयपुर में 9 मरीजों में कोरोना के यह नया वेरिएंट देखने को मिला है. इसे लेकर स्वास्थ्य विभाग सतर्क हो गया है.

omicron
దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్​ కేసులు

By

Published : Dec 5, 2021, 8:03 PM IST

Updated : Dec 5, 2021, 8:57 PM IST

19:57 December 05

దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్​ కేసులు- రాజస్థాన్​లో 9 మందికి వైరస్​

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాజస్థాన్‌లోనూ ప్రవేశించింది. రాజధాని జైపుర్‌లో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపుర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది.

వారితో పరిచయం ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్​గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన వారిని ఆర్​యూహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల పరిస్థితి బాగానే ఉందని.. లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.

Omicron cases in india:

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. మొత్తంగా 21 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలోనే ఆర్​టీపీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను క్వారంటైన్​కు తరలిస్తున్నాయి. ఇప్పటివరకూ పలు రాష్ట్రాల్లో బయటపడిన కేసుల వివరాలు గమనిస్తే..

'మహా'లో..

Omicron cases in Maharashtra: మహారాష్ట్రలోనూ ఆదివారం మరో ఏడు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు.. వారిని కలిసిన మరో ముగ్గురిలో కొత్త వేరియంట్​ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో నైజీరియా నుంచి వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పుణె జిల్లా, పింప్రి చించ్వాడా ప్రాంతంలోని తన సోదరుడిని కలిసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆమె సోదరుడు, ఆయన ఇద్దరు కుమార్తెలకు సైతం ఒమిక్రాన్​ సోకడం గమనార్హం. మరోవైపు.. ఫిన్​లాండ్​ నుంచి పుణెకు గత నెల చివర్లో వచ్చిన వ్యక్తికి సైతం ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది.

దక్షిణాఫ్రికా నుంచి దిల్లీ మీదుగా పుణెలోని దోంబివలీకి వచ్చిన వ్యక్తికి వైరస్​ సోకినట్లు శనివారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనితో రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్​ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి.

దిల్లో..

Omicron Delhi: భారత్​లో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు.. క్రమంగా వివిధ రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. సదరు వ్యక్తిని ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి టాంజానియా నుంచి ఇటీవలే భారత్​కు వచ్చాడు. ఇటీవల విదేశాల నుంచి దిల్లీకి వచ్చినవారిలో 17 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వారిలో 12 మంది నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించగా.. ఒమిక్రాన్ కేసు బయటపడింది.

గుజరాత్​లో..

Gujarat Omicron: గుజరాత్​లోని జామ్​నగర్​లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. జామ్​నగర్​కు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఆఫ్రికాలోని జింబాబ్వే నుంచి ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా.. వైరస్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

కర్ణాటకలో..

karnatka omicron: కర్ణాటక బెంగళూరులో రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు.

Last Updated : Dec 5, 2021, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details