త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో.. ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. కచర్ జిల్లా ప్రధాన కేంద్రం సిల్చార్‌లో 8.13 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్రతువులో సుమారు 3 వేల మంది పాలుపంచుకోవడం విశేషం.
పొడవైన రంగోలీ.. పోలింగ్‌కు చూపించే దారి
ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు అసోంలోని సిల్చార్‌లో 8 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తేయాకు తోటల కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, సైనిక సిబ్బంది ఇలా అన్ని వర్గాల వారు ఇందులో మమేకమయ్యారు. ఆదివారం ఉదయం మొదలుపెట్టి 24 గంటల్లో దీన్ని సిద్ధం చేసినట్లు కీర్తి తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 4 కి. మీ రంగోలీనే భారత్‌లో అత్యంత పొడవైనదిగా ఉందని, ఇప్పుడు ఈ రంగోలీతో ఆ రికార్డును అధిగమించామని కీర్తి తెలిపారు.
ఇదీ చదవండి :'చైనా సరిహద్దులో 59 రహదారుల అనుసంధానం'