ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలోని ఐఐటీ రూర్కీలో 88 మంది విద్యార్థులు.. కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. కొవిడ్ బాధితులందరినీ ఐఐటీ ప్రాంగణంలోని గంగా హాస్టల్‌ను కరోనా కేర్ సెంటర్‌గా మార్చి.. వైద్యులు పర్యవేక్షలో ఉంచినట్లు సంస్థ ప్రతినిధి సోనికా శ్రీ వాస్తవ పేర్కొన్నారు.
88 మంది ఐఐటీ విద్యార్థులకు కరోనా - ఐఐటీ రూర్కీ
ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలో 88 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారందరినీ ప్రత్యేక కరోనా కేర్ సెంటర్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఐఐటీ రూర్కీ
'ఐదు హాస్టళ్లు మూసివేశాం. అయితే ఆన్లైన్ తరగతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం' అని శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:దేశంలో రోజుకు సగటున 34లక్షల మందికి టీకా