దేశంలో కరోనా కేసుల సంఖ్య (India covid cases) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. తాజాగా 8,774 మంది కొవిడ్ (Corona cases in India) బారిన పడ్డారు. కరోనా (Coronavirus India) ధాటికి మరో 621 మంది మృతి చెందారు. ఒక్కరోజే 9,481 మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:3,45,54,975
- మొత్తం మరణాలు:4,68,554
- యాక్టివ్ కేసులు:1,05,691
- మొత్తం కోలుకున్నవారు:3,39,98,278
టీకాల పంపిణీ
శనివారం ఒక్కరోజే 82,86,058 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,21,94,71,134కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. శనివారం 4 లక్షల 81 వేల 926 మందికి కరోనా (Corona update) సోకింది. 5,384 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,13,71,756కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 52,12,373కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- జర్మనీలో కొత్తగా మరో 49,311 మంది కరోనా బారిన పడ్డారు. 170 మంది ప్రాణాలు కోల్పోయారు..
- బ్రిటన్‌లో మరో 39,567 మందికి వైరస్ సోకింది. మరో 131 మంది మృతి చెందారు.
- అమెరికాలో కొత్తగా 22,612 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 127 మంది మరణించారు.
- రష్యాలో మరో 33,946 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,239 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 37,218 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 34 మంది మరణించారు.
- టర్కీలో కొత్తగా 23,759 కరోనా కేసులు నమోదవగా.. 192 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉక్రెయిన్‌లో కొత్తగా 14,200 కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి.
- పోలాండ్(26,182), నెదర్లాండ్స్ (22,315), ఇటలీ (12,877) సహా పలు దేశాల్లో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇదీ చూడండి:దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఆ ఇద్దరికి కరోనా