old woman calls Abhyam helpline : గుజరాత్‌లోని మహిళల కోసం '181 అభయం' పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటైంది. ఈ నెంబర్‌కు ఇటీవలే ఓ విన్నూత్నమైన కాల్ వచ్చింది. అది ఓ వృద్ధురాలి వద్ద నుంచి. వదోదరకు చెందిన ఆమె చెప్పిన విషయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే అని అంటున్నారు ఆ హెల్ప్‌లైన్ నిర్వాహకులు. 87 వయసుగుల తన భర్త ఆమెను సెక్స్ కోసం తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడని, నిరాకరిస్తున్నందుకు తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని వాపోయింది. అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెబుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని పేర్కొంది.
ఇది విన్న 'అభయం' బృందం ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చింది. యోగాను అభ్యసించాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని వృద్ధునికి సూచించింది. ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు సీనియర్ సిటిజన్ల గార్డెన్లు, పార్కులను సందర్శించాలని హితవు పలికింది. మొత్తంమీద ఈ సూచనలు పనిచేశాయని సమాచారం.