Gambling gang arrested in Thailand: థాయ్‌లాండ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్‌ను అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేసినట్లు అక్కడి మీడియా ఓ కథనంలో వెల్లడించింది. అరెస్టయిన వారిలో 83 మంది భారతీయులు ఉండగా.. వారిలో హైదరాబాద్‌కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు.
Gamblers Arrest: థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు అరెస్టు.. నిందితుల్లో చీకోటి ప్రవీణ్ - Chikoti Praveen Kumar arrested
13:26 May 01
Gamblers Arrest: థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు అరెస్టు
థాయ్‌లాండ్‌లోని బాంగ్ లామంగ్ జిల్లాలో ఆసియా పటాయా హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పోలీసులు హోటల్‌లోకి ప్రవేశించిన సమయంలో పెద్ద సంఖ్యలో గ్యాంబ్లర్లు అక్కడ గేమ్‌లు నిర్వహిస్తున్నారు. వీరిని చూడగానే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. మొత్తం 93 మందిని అరెస్టు చేయగా.. అందులో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్, నలుగురు మయన్మార్ దేశస్థులు ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
నిందితుల నుంచి రూ.1.60 లక్షల భారతీయ కరెన్సీ, 20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్, 92 మొబైల్ ఫోన్లు, 8 సీసీటీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ హోటల్‌లో సుమారు రూ.100 కోట్ల మేర గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఆ హోటల్‌లో సోదాలు నిర్వహించి.. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. గ్యాంబ్లింగ్‌కు ఉపయోగించిన పరికరాలన్నింటినీ భారత్ నుంచే తీసుకొచ్చినట్లు అక్కడ పోలీసులు తెలిపారు. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: