తెలంగాణ

telangana

ETV Bharat / bharat

82 ఏళ్ల బామ్మ తగ్గేదేలే.. ఈత పోటీల్లో గోల్డ్ మెడల్.. వందల మందితో పోటీ పడి..

82 ఏళ్ల బామ్మ ఈత పోటీల్లో వారెవ్వా అనిపించారు. వందల మందితో పోటీపడి బంగారు పతకం సాధించారు. ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. హరియాణా అంబాలా జిల్లాలో శనివారం ఈ పోటీలు జరిగాయి.

old women won gold medal in swimming competitions
ఈత పోటీల్లో బంగారు పతకం సాధించిన 82 ఏళ్ల మహిళ

By

Published : Nov 27, 2022, 11:31 AM IST

82 ఏళ్ల బామ్మకు గోల్డ్ మెడల్

82 ఏళ్ల వృద్ధురాలు జాతీయ ఈత పోటీల్లో బంగారు పతకం సాధించారు. వందల మంది పోటీదారులతో హోరాహోరీగా తలపడి మొదటి స్థానంలో నిలిచారు. ఎనిమిది పదుల వయస్సులోనూ ఉత్సాహంగా పోటీపడి గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. హరియాణా అంబాలా జిల్లాలో శనివారం జరిగిన జాతీయ ఈత పోటీల్లో బామ్మ ఈ ఘనత సాధించారు.

వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని హీరోస్ మెమోరియల్ వద్ద జాతీయ ఈత పోటీలు అట్టహాసంగా సాగాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 750 మంది అథ్లెట్​లు పోటీల్లో పాల్గొన్నారు. అయితే బిహార్​కు చెందిన లాల్​ పారి రాయ్​ అనే 82 ఏళ్ల వృద్దురాలు మహిళల సీనియర్ సిటిజన్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నారు. పోటీల్లో పాల్గొనడానికి తన కుమారుడితో కలిసి వచ్చిన ఆ బామ్మ... 100 మీటర్ల ఈత పోటీల్లో గోల్డ్​మెడల్ సాధించారు.

బామ్మ ప్రతిభకు అంతా ముగ్దులైపోయారు. ఆమె క్రీడా స్పూర్తిని కొనియాడారు. కాగా, బామ్మకు 30 ఏళ్లకు పైగా ఈతలో ప్రావీణ్యం ఉంది. నీటిలో మునిగిపోతున్న ఎంతో మందిని కాపాడారు. బామ్మ భర్తకు సైతం ఈతలో మంచి నైపుణ్యం ఉంది. కర్ణాటకకు చెందిన మరో వృద్ధురాలు(72) సైతం ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అంబాలలోని జాతీయ స్విమ్మింగ్​ ఫూల్ బాగుందన్న ఆమె.. నిర్వహణ, సౌకర్యాల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details