దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 9మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 82కు పెరిగింది.
బాధితులందరూ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో సింగిల్రూమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.