తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్యాక్టరీ డ్రైనేజీలో చిన్నారి మృతదేహం.. అత్యాచారం చేసి! - కర్ణాటక బాలిక రేప్​ కేసు

ఓ టైల్స్​ ఫ్యాక్టరీలోని డ్రైనేజీలో 8ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చివరికి ప్రాణాలు తీసినట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది.

Eight year old Karnataka girl rape case
దక్షిణ కన్నడ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక రేప్​ కేసు

By

Published : Nov 22, 2021, 7:07 PM IST

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల చిన్నారి మృతదేహం.. ఓ టైల్స్​ ఫ్యాక్టరీ డ్రైనేజీలో కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి.. ప్రాణాలు తీసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన బాలిక.. టైల్స్​ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ వలస కార్మికుడి కూతురు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్యాక్టరీ వద్ద ఆడుకుంటుండగా.. బాలిక అదృశ్యమైంది. కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టి.. చుట్టుపక్కన ప్రాంతాల్లో వెతికారు. చివరికి.. ఫ్యాక్టరీలోని డ్రైనేజీలోనే ఆమె మృతదేహం కనిపించింది.

నిందితులెవరు?

ఈ ఘటనపై పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళూరు పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఆ ఫ్యాక్టరీలో మొత్తం 30మంది కార్మికులు పనిచేస్తున్నట్టు, ఆదివారం 10మంది విధుల్లోకి రాలేదని పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. 19మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తమ బిడ్డపై అత్యాచారం జరిపి, హత్య చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి:కుమార్తెల కళ్ల ముందే తండ్రి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details