తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా భర్త మగాడు కాదు'.. పెళ్లైన 8 ఏళ్లకు మహిళ ఫిర్యాదు - భర్త అసహజ శృంగారం కోసం వేధిస్తున్నట్లు ఫిర్యాదు

మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన ఇద్దరు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే తన భర్త పురుషుడే కాదని, రహస్య అవయవాలను సర్జరీ చేయించుకున్నాడని ఇప్పుడు ఓ మహిళ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అసహజ శృంగారానికి బలవంతపెడుతున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

husband unnatural sex vadodara
భర్తపై కేసు పెట్టిన భార్య

By

Published : Sep 17, 2022, 6:56 AM IST

Updated : Sep 17, 2022, 7:10 AM IST

వారిద్దరీకి వివాహం జరిగి ఎనిమిదేళ్లయింది. ఇప్పుడు ఆ మహిళ(40) తన భర్త పురుషుడే కాదని, ప్రైవేట్ భాగాలకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తనకు తెలియకుండా దాచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్​లోని వడోదరాలో జరిగింది.
ఈ క్రమంలో అసహజ శృంగారం, మోసం అభియోగాల కింద బాధితురాలి.. భర్తపై గత బుధవారం గోత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం దాచి పెళ్లి చేసినందుకు అత్తింటివారి పేర్లు కూడా ఆమె ఫిర్యాదులో చేర్చారు. వివాహ సంబంధాల వెబ్‌సైటు ద్వారా పరిచయమైన వీరిద్దరికీ 2014 ఫిబ్రవరిలో వివాహమైంది.

హనీమూన్‌ కోసం కశ్మీర్‌కు కూడా వెళ్లారు. చాలా రోజులపాటు తనకు దూరంగా ఉంటూ సాకులు చెబుతున్న భర్తను ఆమె నిలదీయగా.. రష్యాలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తాను శృంగార సామర్థ్యం కోల్పోయినట్లు సమాధానం వచ్చింది. ఆ తర్వాత 2020లో పొట్ట తగ్గేందుకు సర్జరీ అని కోల్‌కతాకు వెళ్లిన తన భర్త.. పురుష అవయవాల కోసం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెతో అసహజ శృంగారం ప్రారంభించిన అతడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్తను దిల్లీలో అరెస్టు చేసి.. వడోదరాకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీసులు వెల్లడించారు.

Last Updated : Sep 17, 2022, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details